Published : 14 Mar 2022 08:50 IST

Hyderabad News: హైదరాబాద్‌కు విమానాల పండగ వచ్చేసింది..

 24 నుంచి 27 వరకూ ‘వింగ్స్‌ ఇండియా-2022’

బేగంపేట ఎయిర్‌పోర్టులో ప్రదర్శన

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: దేశీయ, అంతర్జాతీయ సంస్థలకు చెందిన అత్యాధునిక విమానాలు, జెట్లు, హెలికాప్టర్లు నగరవాసుల్ని కనువిందు చేసే పండగ మళ్లీ వచ్చేసింది. ఈ లోహ విహంగాల భారీ ప్రదర్శనకు బేగంపేట విమానాశ్రయం వేదిక కానుంది. ఈ నెల 24 నుంచి ‘వింగ్స్‌ ఇండియా-2022’ పేరిట ఇది ప్రారంభమవుతుంది. నాలుగు రోజుల పాటు(27 వరకూ) కొనసాగుతుంది. నాలుగేళ్ల అనంతరం ఈ ప్రదర్శన జరుగుతుండటం గమనార్హం. ఈ ప్రదర్శనలో దాదాపు 200కు పైగా అంతర్జాతీయ సంస్థలు, ఎగ్జిబిటర్లు పాల్గొంటారు. ఆరు వేల మందికిపైగా వ్యాపారులు(ట్రేడ్‌ విజిటర్స్‌), 50 వేల మందికి పైగా సందర్శకులు పాల్గొంటారని అంచనా. ప్రదర్శనను వీక్షించేందుకు వింగ్స్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. తొలి మూడు రోజులు వ్యాపారవేత్తలను అనుమతిస్తారు. చివరి రోజు సాధారణ సందర్శకులు రూ.500 చెల్లించి ప్రదర్శనను వీక్షించొచ్చు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts