Weather forecast: వడగాలులు వీస్తున్నాయ్... పారాహుషార్
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. అధిక ఉష్ణోగ్రతలుంటాయని ఆరెంజ్ రంగు హెచ్చరిక జారీచేసింది.
వాతావరణశాఖ హెచ్చరిక
నల్గొండలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత
ఈనాడు, హైదరాబాద్ : రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశాలున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీచేసింది. అధిక ఉష్ణోగ్రతలుంటాయని ఆరెంజ్ రంగు హెచ్చరిక జారీచేసింది. పగటి ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో సాధారణంకన్నా ఆరేడు డిగ్రీలు అదనంగా పెరిగినందున ఎండల వేడి తీవ్రత బాగా పెరిగి ఉక్కపోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బుధవారం పగలు రాష్ట్రంలోకెల్లా అత్యధికంగా నల్గొండలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణంకన్నా 5 డిగ్రీలు అధికం అని వాతావరణశాఖ స్పష్టం చేసింది. గత పదేళ్ల మార్చి నెలలో నల్గొండ పట్టణంలో ఇంత అత్యధిక ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. 2016 మార్చి 23న అత్యధికంగా 42 డిగ్రీలు నమోదైంది.
5 డిగ్రీలు పెరిగినా లేదా తగ్గినా...అసాధారణం
ఏ ప్రాంతంలో అయినా సాధారణంకన్నా ఐదు డిగ్రీలకు మించి ఎక్కువ లేదా తక్కువ ఉష్ణోగ్రత నమోదైతే అక్కడ వాతావరణంలో అనూహ్య మార్పులతో అసాధారణ వాతావరణం ఉన్నట్లుగా పరిగణిస్తారు. రాష్ట్రంలో ఆదిలాబాద్, రామగుండం, నిజామాబాద్, పెద్దపల్లి భద్రాచలం, మెదక్ తదితర ప్రాంతాల్లో బుధవారం 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదైంది. ఇదేరకంగా ఉష్ణోగ్రతలు పెరిగే సూచనలున్నందున ప్రజలు వేడిలో తిరగరాదని వాతావరణశాఖ సూచించింది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి తెలంగాణలోకి గాలులు వీస్తున్నందున ఉష్ణోగ్రతలు పెరుగుతున్నట్లు ఈ శాఖ తెలిపింది. ఈ వేడికి గాలిలో తేమ అసాధారణ స్థాయిలో తగ్గి పొడి వాతావరణం ఏర్పడి ఉక్కపోతలు అధికమయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
WT20 WC 2023: మహిళల టీ20 ప్రపంచకప్.. టీమ్ఇండియా షెడ్యూల్ ఇదే
-
Crime News
Rajasthan: పెట్రోల్ ట్యాంకర్లో మద్యం అక్రమ రవాణా..!
-
World News
Australia: డాల్ఫిన్లతో ఈతకని దిగి.. సొర చేపకు చిక్కి..!
-
Sports News
Gill: ‘శుభ్‌మన్.. నాగ్‌పుర్ ఏదో చెబుతోంది చూడు’’: ఉమేశ్ యాదవ్ ఫన్నీ ట్వీట్
-
World News
Wikipedia: పాక్‌లో వికీపీడియాపై నిషేధం.. స్పందించిన వికీమీడియా
-
General News
Rushikonda: బోడికొండకు కవరింగ్.. జర్మన్ టెక్నాలజీతో జియో మ్యాటింగ్