చినజీయర్‌ స్వామి వ్యాఖ్యలపై నిరసనలు.. క్షమాపణలు చెప్పాల్సిందే: సీతక్క

సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్‌స్వామి చేసిన వ్యాఖ్యలు అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రెండు

Updated : 18 Mar 2022 09:41 IST

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి, న్యూస్‌టుడే బృందం: సమ్మక్క, సారలమ్మలపై చినజీయర్‌స్వామి చేసిన వ్యాఖ్యలు అంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్‌, మహబూబాబాద్‌, ములుగు జిల్లాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల రెండు రోజులుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద గురువారం ములుగు ఎమ్మెల్యే సీతక్క పూజారులతో కలిసి మాట్లాడారు. వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వాజేడు పోలీస్‌స్టేషన్‌లో బీఎస్పీ నాయకులు ఫిర్యాదు చేశారు. ఓయూ ఆర్ట్స్‌ కళాశాల ఆవరణలో గిరిజనశక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్‌నాయక్‌ నేతృత్వంలో నిరసన తెలిపారు. చినజీయర్‌స్వామిని తెలంగాణ నుంచి బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన సంఘం రంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ శ్రీనునాయక్‌ కొందుర్గు ఠాణాలో.. యూత్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో వనస్థలిపురం, కొడంగల్‌ స్టేషన్లలో  చినజీయర్‌పై ఫిర్యాదు చేశారు. చినజీయర్‌స్వామి వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్‌ చేయగా.. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ దళిత హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు ఏసురత్నం ఒక ప్రకటనలో కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని