Andhra News: 11న ఏపీ మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణ!

దూకుడు.. సీనియారిటీ.. వైకాపా ఆవిర్భావం నుంచి, అంతకంటే ముందు నుంచి వెంట నిలిచినవారు.. 2014-19 మధ్య ఎంత ఒత్తిడి వచ్చినా పార్టీని వీడని ఎమ్మెల్యేలు.. ఇలా నాలుగు విభాగాలుగా ఆశావహులను

Updated : 31 Mar 2022 07:43 IST

ఈనాడు, అమరావతి: దూకుడు.. సీనియారిటీ.. వైకాపా ఆవిర్భావం నుంచి, అంతకంటే ముందు నుంచి వెంట నిలిచినవారు.. 2014-19 మధ్య ఎంత ఒత్తిడి వచ్చినా పార్టీని వీడని ఎమ్మెల్యేలు.. ఇలా నాలుగు విభాగాలుగా ఆశావహులను క్రోడీకరించి వారిలో కొందరిని మంత్రిమండలిలోకి తీసుకునేందుకు సీఎం జగన్‌ కసరత్తు చేస్తున్నట్లు వైకాపా వర్గాల్లో చర్చ సాగుతోంది. వీరే కాకుండా సామాజిక, రాజకీయ సమీకరణలో భాగంగా తీసుకునేవారూ ఉంటారని చెబుతున్నారు.

జిల్లాకు ఒకరు...

మంత్రిమండలి పునర్‌వ్యవస్థీకరణకు ఏప్రిల్‌ 11న ఉదయం 11.31 గంటలకు ముహూర్తం ఖరారైనట్లు అధికార పార్టీ వర్గాల కథనం. జిల్లాకు ఒక మంత్రి ప్రాతిపదికను అమలుచేసే అవకాశమున్నట్లు సమాచారం. సామాజిక, రాజకీయ సమీకరణల దృష్ట్యా దీనికి అతీతంగానూ కొందరిని తీసుకోవచ్చనే చర్చ కూడా ఉంది. అప్పుడు రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ఎంపిక చేస్తారని అంటున్నారు. సీనియారిటీపరంగా ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డి వంటి నేతల పేర్లు పరిశీలనలోకి తీసుకోవచ్చని వైకాపా నేతలు అంటున్నారు. ప్రాతిపదికేంటి? ఉన్నవారిలో ఎవరిని తొలగిస్తారు? కొత్తగా ఎవరు మంత్రిమండలిలోకి వస్తారనే విషయాలపై సీఎం ఇప్పటికీ తన ఆలోచనను ఎవరి దగ్గరా బయట పెట్టలేదని పార్టీ ముఖ్యనేతలు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని