TTD: భక్తుల సేవలో తితిదే వసతి సముదాయాలు

కొవిడ్‌ సమయంలో తిరుపతితో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు తితిదేకు చెందిన వసతి సముదాయాలు క్వారంటైన్‌ కేంద్రాలుగా సేవలు అందించాయి. రెండు సంవత్సరాల సేవల అనంతరం ఇటీవల ఒక్కొక్కటిగా భక్తులకు అందుబాటులోకి

Updated : 15 Apr 2022 05:39 IST

 కొవిడ్‌ తీవ్రత తగ్గడంతో అందుబాటులోకి

ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ విధానాల్లో గదుల కేటాయింపు

తిరుపతి(తితిదే), న్యూస్‌టుడే: కొవిడ్‌ సమయంలో తిరుపతితో పాటు రాయలసీమ ప్రాంత ప్రజలకు తితిదేకు చెందిన వసతి సముదాయాలు క్వారంటైన్‌ కేంద్రాలుగా సేవలు అందించాయి. రెండు సంవత్సరాల సేవల అనంతరం ఇటీవల ఒక్కొక్కటిగా భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు ఇవి ఉపయోగపడుతున్నాయి. తిరుమలలో గదుల కొరత ఉన్న కారణంగా తిరుపతిలోని వసతి సముదాయాలను ఉపయోగించుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు. కొన్ని ఆన్‌లైన్‌లో.. మరికొన్ని ఆఫ్‌లైన్లో అందుబాటులో ఉన్నాయి. ఆన్‌లైన్‌ బుకింగ్‌కు తితిదే వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంది.


మాధవం విశ్రాంతి భవనం

శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం ఆవరణంలో మాధవం విశ్రాంతి భవనం ఉంది. ఇక్కడ  ఏసీ గదులు రూ.800, ఏసీ డీలక్స్‌ గదులు రూ.1000 అద్దెకు కేటాయిస్తారు. గదుల కేటాయింపు శ్రీనివాసంలో జరుగుతుంది. ఇందులో మొత్తం 160 గదులు ఉన్నాయి. ఆన్‌లైన్‌లో బుకింగ్‌ చేసుకున్న వారికే ఇస్తారు.


శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం

తిరుపతి ఆర్టీసీ బస్టాండు ఎదురుగా శ్రీనివాసం యాత్రికుల వసతి సముదాయం ఉంది. ఇక్కడ మొత్తం 538 గదులు అందుబాటులో ఉన్నాయి. నాన్‌ ఏసీ గదులకు రూ.200, ఏసీ గదులకు రూ.400, ఏసీ డీలక్స్‌కు రూ.600 అద్దె చెల్లించాల్సి ఉంది. లాకర్ల సౌకర్యం కూడా ఉంది. ఆన్‌లైన్‌ విధానంలో బుకింగ్‌ చేసుకున్న వారికి గదులు కేటాయిస్తారు. ఇక్కడ మధ్యాహ్నం, రాత్రి సమయాల్లో భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు.


విష్ణు నివాసం

తిరుపతి రైల్వేస్టేషన్‌ ఎదురుగా విష్ణునివాసం యాత్రికుల వసతి సముదాయం ఉంది. ఇక్కడ సగం గదులు ఆన్‌లైన్‌లో.. మిగిలినవి ఆఫ్‌లైన్‌లో కేటాయిస్తారు. నాన్‌ ఏసీ గదులు 98 ఉన్నాయి. వీటికి అద్దె రూ.300. నాన్‌ ఏసీ సూట్‌ గదులు 4 ఉన్నాయి. వీటిని రూ.500 అద్దెకు కేటాయిస్తారు. ఏసీ గదులు 98 ఉండగా రూ.800 అద్దె. ఏసీ సూట్‌ గదులు 4 ఉంటే వీటిని రూ.1300 అద్దెతో కేటాయిస్తున్నారు.భక్తులకు లాకర్ల సౌకర్యం ఉంది.


శ్రీ గోవిందరాజస్వామి సత్రాలు

రైల్వేస్టేషన్‌కు వెనకవైపు విశాలమైన పార్కింగ్‌ స్థలంతో కూడిన శ్రీ గోవిందరాజస్వామి సత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఉచిత గదుల సత్రం ఒకటి, రూ.50 అద్దె గదుల సత్రం మరొకటి ఉంది. మొదటి సత్రంలో 192 గదులు, రెండో సత్రంలో 181 గదులు ఉన్నాయి. ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భక్తులకు ఉచిత భోజన సదుపాయం కల్పిస్తున్నారు. నేరుగా వచ్చే భక్తులకు గదులు కేటాయిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని