Kandukuri Veeresalingam: కందుకూరి అడుగుజాడలు!

జీవితాంతం సమాజ సేవకే అంకితమైన పరిపూర్ణ వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. 1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరంలోని వంకాయలవారి వీధిలో ఆయన జన్మించారు. కందుకూరి జన్మించిన ఇల్లు ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దాన్ని భావితరాల కోసమని పరిశోధన కేంద్రంగా నిర్వహిస్తోంది

Updated : 16 Apr 2022 05:21 IST

నేడు వీరేశలింగం 175వ జయంతి

-న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం సాంస్కృతికం

జీవితాంతం సమాజ సేవకే అంకితమైన పరిపూర్ణ వ్యక్తి కందుకూరి వీరేశలింగం పంతులు. 1848 ఏప్రిల్‌ 16న రాజమహేంద్రవరంలోని వంకాయలవారి వీధిలో ఆయన జన్మించారు. కందుకూరి జన్మించిన ఇల్లు ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధీనంలో ఉంది. దాన్ని భావితరాల కోసమని పరిశోధన కేంద్రంగా నిర్వహిస్తోంది. సంఘసంస్కర్తగా వీరేశలింగం చేసిన కృషి, అలనాటి విశేషాలు అక్కడ ఇప్పటికీ కనిపిస్తాయి. అనేక సంఘ సంస్కరణలు చేసిన కందుకూరి వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించారు. బాలికా విద్యపై అవగాహన కల్పించారు. సామాజిక దురాచారాలు, అవినీతి అంతానికి పత్రికలు స్థాపించారు. ఇందుకు ఆయన ఇంటినే ముద్రణాలయంగా మార్చారు. ఇప్పటికీ ఆ ఇంట్లో అలనాటి ముద్రణా యంత్రం ఉంది. వ్యవస్థల్లో లోపాలు ప్రజలకు తెలిసేలా పలు నాటకాలూ రచించారు. నేడు వీరేశలింగం 175వ జయంతి సందర్భంగా ఆ సంస్కర్త స్మృతులను ఆ గృహంలో చూడొచ్చు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని