Tamilisai: ఆ రెండు ఘటనలపై సమగ్ర నివేదిక ఇవ్వండి: రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్‌ ఆదేశం

ఖమ్మం జిల్లాలో సామినేని సాయిగణేశ్‌, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకుల ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. భాజపా నేతలు సమర్పించిన పలు మీడియా, సోషల్‌ మీడియా కథనాలు,

Updated : 22 Apr 2022 07:39 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఖమ్మం జిల్లాలో సామినేని సాయిగణేశ్‌, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకుల ఆత్మహత్యలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. భాజపా నేతలు సమర్పించిన పలు మీడియా, సోషల్‌ మీడియా కథనాలు, వినతి పత్రాలపై స్పందించిన గవర్నర్‌ గురువారం ఈ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన పరువు హత్యలు, సామూహిక అత్యాచారం వంటి ఇతర నేరాలపైనా వివరణ ఇవ్వాలని సూచించారు.

పీజీ మెడికల్‌ సీట్ల బ్లాక్‌ దందాపై చర్యలకు ఆదేశం

రాష్ట్రంలోని పలు ప్రైవేటు వైద్యకళాశాలలు పీజీ సీట్లను.. అర్హులైన నీట్‌ ర్యాంకర్లకు కేటాయించకుండా బ్లాక్‌ చేసి అడ్డదారిలో విక్రయిస్తున్న వ్యవహారంపై గవర్నర్‌ తమిళిసై తీవ్రంగా స్పందించారు. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టి, నివేదిక ఇవ్వాలని గురువారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతిని ఆదేశించారు. సీట్ల బ్లాక్‌ దందాపై ఆరోగ్య వర్సిటీ వీసీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని