KTR: రూ. 3700 కోట్ల సంస్థలో సగం వాటా రూ. 211 కోట్లేనా?

కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘పవన్‌ హన్స్‌’లో 49 శాతం వాటాను రూ. 211 కోట్లకు అమ్మడం వెనక పెద్ద మతలబే ఉందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మంగళవారం

Updated : 10 Aug 2022 11:31 IST

ఆర్నెల్ల ప్రైవేటు కంపెనీకి అప్పగింతా?

‘పవన్‌ హన్స్‌’ వాటా విక్రయంలో మతలబు ఏమిటి.. ట్విటర్‌లో కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ‘పవన్‌ హన్స్‌’లో 49 శాతం వాటాను రూ. 211 కోట్లకు అమ్మడం వెనక పెద్ద మతలబే ఉందని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్‌ మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. 2017లోనే రూ. 3700 కోట్ల విలువ ఉన్న లాభదాయక సంస్థ పవన్‌ హన్స్‌లోని దాదాపు సగం వాటాను ఆరు నెలల కిందట రూ. లక్ష మూలధనంతో స్థాపించిన ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడంపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయన్నారు. భాజపా ఆధ్వర్యంలోని నిరర్ధక కేంద్ర ప్రభుత్వం వద్ద వీటికి సమాధానాలున్నాయా అని ఆయన ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని