Telangana News: లక్షణంగా ఇంట్లోకి
డబుల్ బెడ్రూం ఇళ్లకు పట్టిన గ్రహణం వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల ఆశలు ఫలించే సమయం సమీపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్ల వివరాలను జిల్లాలు..నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలవారీగా ప్రభుత్వం సేకరించింది.
లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీకి ప్రభుత్వం కసరత్తు
జిల్లాలు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా లెక్కలు
జూన్‌లో లబ్ధిదారుల జాబితా కేంద్రానికి ఇస్తామన్న రాష్ట్రం
త్వరలో పూర్తయిన గృహాలను సీఎం పరిశీలించే అవకాశం
ఈనాడు, హైదరాబాద్: డబుల్ బెడ్రూం ఇళ్లకు పట్టిన గ్రహణం వీడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న పేదల ఆశలు ఫలించే సమయం సమీపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణం పూర్తయిన ఇళ్ల వివరాలను జిల్లాలు..నగర, పట్టణ, గ్రామీణ ప్రాంతాలవారీగా ప్రభుత్వం సేకరించింది. లక్ష పైచిలుకు ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లుగా అధికారులు లెక్క తేల్చారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉన్నట్లు గృహనిర్మాణశాఖ వర్గాలకు సమాచారం అందింది. రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు రాష్ట్రానికి రావాల్సి ఉంది. లబ్ధిదారుల జాబితా ఇవ్వాలని కేంద్రం షరతు విధించడంతో జూన్‌లో ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయడంతో కదలిక మొదలైంది.
లబ్ధిదారుల ఎంపికకు సర్వే మొదలు
నిర్మాణం పూర్తయిన లక్షకు పైచిలుకు ఇళ్లలో సింహభాగం చాలాకాలం క్రితమే పూర్తయ్యాయి. లబ్ధిదారుల ఎంపిక మొదలుకాకపోవడంతో కొన్నిచోట్ల తలుపులు, కిటికీలు చోరీకి గురయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పంపిణీపై దృష్టి పెట్టింది. ‘లబ్ధిదారుల ఎంపికకు సర్వే మొదలైంది. జూన్‌లో ఇళ్ల పంపిణీ ఉండవచ్చని’ గృహనిర్మాణశాఖకు చెందిన కీలక అధికారి చెప్పారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన 14వేల పైచిలుకు ఇళ్ల విషయంలో పలుచోట్ల వివాదాలు నెలకొన్నాయి. డబ్బులు తీసుకుని లబ్ధిదారుల్ని ఎంపిక చేశారన్న ఆరోపణలొచ్చాయి. 2016-17లో రెండు పడక గదుల ఇళ్ల పథకం మొదలైంది. నిధులు, స్థలాల కొరత, నిర్మాణవ్యయం గిట్టుబాటు కాదన్న కారణంతో గుత్తేదారులు అనాసక్తి చూపడం వంటి కారణాలతో నిర్మాణం ఆలస్యమైంది.
అత్యధికంగా సిద్దిపేటలో
ఇప్పటివరకు సిద్దిపేటలో అత్యధికంగా 3,272 ఇళ్లు పంపిణీ చేశారు. తర్వాత హైదరాబాద్‌లో 2,379, ఖమ్మంలో 1,961, భూపాలపల్లిలో 1,797. నిర్మాణం పూర్తయినవాటిలో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో ఒకేచోట దాదాపు 17 వేల ఇళ్లు, హైదరాబాద్ శివారు రాంపల్లిలో 4 వేల పైచిలుకు ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నట్లు గృహనిర్మాణశాఖ అధికారి ఒకరు తెలిపారు. వికారాబాద్, నారాయణపేట జిల్లాల్లో ఇప్పటివరకు ఒక్క ఇంటి నిర్మాణం కూడా పూర్తికాలేదు.
జిల్లాల వారీగా మంజూరైన ఇళ్ల వివరాలు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్‌ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్‌ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్‌రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్‌ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్‌వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్‌పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్‌రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్‌రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్‌రెడ్డి, ఎం.విజయ్‌కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్‌కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్‌లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్‌పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్‌క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫోన్‌ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్‌రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్
-
తెలంగాణలో పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్ ఒకటి నుంచి వడగాల్పులు
-
కొరియాపై ఐరాస ఆంక్షల వల్ల ప్రయోజనం లేదు: రష్యా
-
టిల్లు స్క్వేర్.. రూ.100 కోట్ల గ్రాస్ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ
-
‘వారిపై సినిమాలు రావాలి’.. మస్క్ ఆలోచనకు మహీంద్రా సపోర్ట్