Updated : 09 May 2022 04:26 IST

Asani Cyclone: తీవ్ర తుపానుగా అసని!

నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు

ఈనాడు, హైదరాబాద్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అసని’ సోమవారం తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఇది పదో తేదీ సాయంత్రానికి ఉత్తరాంధ్ర, ఒడిశా తీరంవైపు వెళ్లే సూచనలున్నట్లు వివరించింది. దక్షిణ కోస్తాంధ్రపై 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ  ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆదివారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా సత్యనారాయణపురం(భద్రాద్రి జిల్లా)లో 2.3, మధిర(ఖమ్మం)లో 1.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సోమవారం వర్షాలు లేని ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ ‘ఆరెంజ్‌’ రంగు హెచ్చరిక జారీచేసింది. ఆదివారం పగలు అత్యధికంగా జైనథ్‌(ఆదిలాబాద్‌ జిల్లా)లో 42.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం రాత్రి అత్యధికంగా కాచిగూడలో 31 డిగ్రీలు నమోదైనట్లు రాష్ట్ర ప్రణాళికాభివృద్ధి సొసైటీ తెలిపింది. నగరంలో రాత్రిపూట 30 డిగ్రీలు దాటడం ఏడాదికాలంలో ఇదే ప్రథమమని వాతావరణశాఖ సంచాలకురాలునాగరత్న తెలిపారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని