Updated : 14 May 2022 07:47 IST

Telangana News: ఉద్యోగుల ఆరోగ్య పథకానికి మూలవేతనంలో 1% వాటా

తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ఏకగ్రీవ తీర్మానం

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ఉద్యోగుల ఆరోగ్య పథకాని(ఈహెచ్‌ఎస్‌)కి ప్రతినెలా తమ మూలవేతనంలో ఒక్క శాతం వాటాను ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం నిర్ణయించింది. శుక్రవారం టీజీవో భవన్‌లో జరిగిన అత్యవసర సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా టీజీవోల అధ్యక్షురాలు మమత మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధిక జీతభత్యాలను కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా ఉందని, ఉద్యోగుల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తోందన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఆరోగ్యపథకంలో తాము సైతం భాగస్వాములమయ్యేందుకు నిర్ణయించామన్నారు.


రెండు శాతం చందాతో ఉద్యోగులపై భారం  

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగులకు నగదు రహిత వైద్యానికి వారి వేతనాల నుంచి రెండు శాతం చందా కింద కోతపెడితే ఆర్థికంగా భారమవుతుందని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) పేర్కొంది. ఈ మేరకు శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావును ఆయన కార్యాలయంలో కలిసి ఈ ఉద్యోగుల ఆందోళనను తెలియజేసింది. అనంతరం ఒక ప్రకటనను ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతంకుమార్‌ విడుదల చేశారు. హరీశ్‌రావు కూడా అన్ని సంఘాలతో చర్చించి, ఉద్యోగుల శ్రేయస్సును పరిగణనలోకి తీసుకుని సీఎం దృష్టికి తీసుకెళ్తానని, ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని భరోసా ఇచ్చారని వారు పేర్కొన్నారు.


2 శాతం చందాకు అంగీకరించం: జాక్టో

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నగదు రహిత వైద్యం అమలుకు వేతనాల నుంచి రెండు శాతం చందా వసూలు చేయడానికి టీఎన్‌జీవో అంగీకరించడాన్ని ఉపాధ్యాయ సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి(జాక్టో) స్టీరింగ్‌ కమిటీ ఖండించింది. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ఎలా ప్రకటిస్తారని జాక్టో సమావేశం ప్రశ్నించింది.

Read latest Ts top news News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని