Published : 19 May 2022 04:40 IST

మద్యం ధరల పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం ధరలు పెరిగాయి. 2021-23 మద్యం విధానం అమల్లోకి వచ్చాక ధరలు పెంచడం ఇదే తొలిసారి. ఈ అంశంపై బుధవారం రాత్రి వరకు ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. అయితే ఏ రకం మద్యంపై ఎంత ధర పెంచాలనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. బుధవారం రాత్రి మద్యం విక్రయ వేళలు ముగియగానే వైన్స్‌, బార్లు, పబ్‌లను ఎక్సైజ్‌ అధికారులు సీజ్‌ చేశారు. ఈమేరకు ఆయా నిర్వాహకులకు ముందస్తుగానే సమాచారం అందించారు. బుధవారం రాత్రి వాటిని మూసేసే సమయానికి ఎంత సరకు నిల్వ ఉందో లెక్కించనున్నారు. గురువారం నుంచి పెరిగిన ధరలు అమలు చేసేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యపై వ్యాపారవర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని