కార్డు లేకుండానే నగదు ఉపసంహరణ

కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు వీలు కల్పించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది. ఏటీఎంలలో ఇంటర్‌ఆపరబుల్‌ కార్డ్‌ లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ఐసీసీడబ్ల్యూ) అవకాశాన్ని కల్పించాలని తెలిపింది.

Published : 20 May 2022 04:59 IST

అన్ని ఏటీఎంలలో అవకాశం కల్పించండి
బ్యాంకులకు ఆర్‌బీఐ ఆదేశాలు

ముంబయి: కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు వీలు కల్పించాలని బ్యాంకులను ఆర్‌బీఐ కోరింది. ఏటీఎంలలో ఇంటర్‌ఆపరబుల్‌ కార్డ్‌ లెస్‌ క్యాష్‌ విత్‌డ్రాయల్‌ (ఐసీసీడబ్ల్యూ) అవకాశాన్ని కల్పించాలని తెలిపింది. స్కిమ్మింగ్‌, కార్డ్‌ క్లోనింగ్‌, డివైజ్‌ టాంపరింగ్‌ వంటి మోసాలు జరగకుండా ఈ చర్య ఉపయోగపడనుంది. ప్రస్తుతం కొన్ని బ్యాంకులు మాత్రమే సొంత ఏటీఎంలలో కార్డులేకుండా నగదు ఉపసంహరణకు వీలు కల్పిస్తున్నాయి. ‘అన్ని బ్యాంకులు, ఏటీఎం నెట్‌వర్క్‌లు, డబ్ల్యూఎల్‌ఏఓ (వైట్‌ లేబుల్‌ ఏటీఎం సంస్థ)లు తమ ఏటీఎంలలో ఐసీసీడబ్ల్యూ అవకాశాన్ని కల్పించవచ్చ’ని గురువారం విడుదల చేసిన సర్క్యులర్‌లో ఆర్‌బీఐ పేర్కొంది. లావాదేవీల విషయంలో వినియోగదారు ధ్రువీకరణ కోసం (యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌) యూపీఐని వినియోగించి నేషనల్‌ ఫైనాన్షియల్‌ స్విచ్‌/ఏటీఎం నెట్‌వర్క్‌ల ద్వారా సెటిల్‌మెంట్‌ చేయొచ్చని తెలిపింది.

సొంత, ఇతర ఏటీఎంలలో జరిగే ఐసీసీడబ్ల్యూ లావాదేవీలపై ఛార్జీలు విధించరాదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఇంటర్‌ఛేంజ్‌ ఫీజు, కస్టమర్‌ ఛార్జీలు మినహా మిగతా ఏమీ వసూలు చేయరాదంది. ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణకు ప్రస్తుత సంఖ్యా పరిమితులే ఐసీసీడబ్ల్యూ లావాదేవీలకూ వర్తిస్తాయని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని