విక్రమ్‌-1 రాకెట్‌ ఇంజిన్‌ విజయవంతం

హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ- స్కైరూట్‌ ఏరోస్పేస్‌, తన విక్రమ్‌-1 రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపింది. నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ప్రొపెల్లెంట్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ స్టాటిక్‌

Published : 20 May 2022 05:36 IST

స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌కు చెందిన అంకుర సంస్థ- స్కైరూట్‌ ఏరోస్పేస్‌, తన విక్రమ్‌-1 రాకెట్‌ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించినట్లు తెలిపింది. నాగ్‌పుర్‌లోని సోలార్‌ ఇండస్ట్రీస్‌ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ప్రొపెల్లెంట్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ స్టాటిక్‌ టెస్టింగ్‌ సదుపాయంలో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. మనదేశంలో ప్రైవేటు రంగంలో ఇదే తొలి రాకెట్‌ ఇంజిన్‌ ప్రయోగమని సంస్థ పేర్కొంది. విక్రమ్‌-1 రాకెట్‌, మూడు దశల్లో ఘన ఇంధనంతో పనిచేసే ఇంజిన్‌. ఒక్కోదశ సమయం 80 నుంచి 108 సెకన్లు ఉంటుంది. మూడో దశలో ఈ ఇంజిన్‌ 100 కేఎన్‌ (దాదాపు 10 టన్నులు) వ్యాక్యూమ్‌ థ్రస్ట్‌ ఉత్పత్తి చేస్తుంది. మూడోదశకు కలామ్‌-100 అని.. మాజీ రాష్ట్రపతి డాక్టర్‌ ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ పేరును పెట్టారు. ఈ ప్రయోగం విజయవంతమై, తమ భవిష్యత్తు ప్రయోగాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచినట్లు స్కైరూట్‌ సీఈఓ పవన్‌కుమార్‌ చందన తెలిపారు. ఈ రాకెట్‌తో 480 కిలోల బరువు గల ఉపగ్రహాలను అంతరిక్షంలో 500 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లవచ్చని వివరించారు. తొలి ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించడం ద్వారా.. తమ డిజైనింగ్‌ సామర్థ్యాన్ని నిరూపించుకున్నామని స్కైరూట్‌ ఉపాధ్యక్షుడు వీజీ ఈశ్వరన్‌ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు