పునరుద్ధరణ ఆశలు ఆవిరి.. చూసిపోదామని చివరిసారి!

ఆదిలాబాద్‌ సిమెంట్‌ పరిశ్రమ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా- సీసీఐ)లో నిర్మాణాలను తుక్కు కింద వేలంలో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. గతంలో అందులో పనిచేసిన ఉద్యోగులు ఒకింత నిర్వేదానికి

Published : 20 May 2022 05:36 IST

ఈనాడు, ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ సిమెంట్‌ పరిశ్రమ (సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా- సీసీఐ)లో నిర్మాణాలను తుక్కు కింద వేలంలో విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో.. గతంలో అందులో పనిచేసిన ఉద్యోగులు ఒకింత నిర్వేదానికి గురయ్యారు. 1982 ఆగస్టు 15న ప్రారంభమైన ఈ పరిశ్రమ 2,500 మందికి ప్రత్యక్షంగా.. మరో 2 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించింది. ఆర్థిక భారంతో 1999లో మూతపడింది. మళ్లీ తెరవకపోతారా? అని చాలా మంది ఉద్యోగులు వేచిచూస్తున్నారు. కొందరు అక్కడే క్వార్టర్స్‌లో ఉంటున్నారు. కేంద్రం తాజా నిర్ణయంతో పునరుద్ధరణ ఆశలు ఆవిరైన ఆయా ఉద్యోగులు తమ పిల్లలతో గురువారం పరిశ్రమ వద్దకు వచ్చి పాత అనుభూతులను గుర్తు చేసుకుని స్వీయ చిత్రాలు తీసుకున్నారు. ఇక్కడి పాఠశాలలో 2002లో 10వ తరగతి పూర్తిచేసిన రాజేంద్రప్రసాద్‌.. తరగతి గదిలో బోర్డుపై తాను అప్పట్లో రాసిన రాతలు ఇప్పటికీ ఉండడాన్ని చూసి భావోద్వేగానికి గురయ్యాడు. వీళ్లదే ఆ పాఠశాలలో చివరి బ్యాచ్‌ కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని