17ఏళ్ల గోడు.. పేదలకు లేదా గూడు

వరంగల్‌ నగరం భట్టుపల్లి రోడ్డులో నిర్మించిన రెండో దశ వాంబే ఇళ్లను తక్షణమే కేటాయించి, పట్టాలివ్వాలని పేదలు పెద్దసంఖ్యలో సంబంధిత ఓ అపార్టుమెంటు ఎక్కి నిరసన తెలిపారు. గురువారం సీపీఎం కరీమాబాద్‌ ఏరియా

Published : 20 May 2022 05:36 IST

న్యూస్‌టుడే, కరీమాబాద్‌ఫ వరంగల్‌ నగరం భట్టుపల్లి రోడ్డులో నిర్మించిన రెండో దశ వాంబే ఇళ్లను తక్షణమే కేటాయించి, పట్టాలివ్వాలని పేదలు పెద్దసంఖ్యలో సంబంధిత ఓ అపార్టుమెంటు ఎక్కి నిరసన తెలిపారు. గురువారం సీపీఎం కరీమాబాద్‌ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఈ పోరాటం సాగింది. సీపీఎం జిల్లా కార్యదర్శి రంగయ్య మాట్లాడుతూ 1200 కుటుంబాలకు 22 అపార్టుమెంట్లు నిర్మించి 17 సంవత్సరాలైనా ఇళ్లులేని నిరుపేదలకు కేటాయించలేదన్నారు. వాంబే ఇళ్లను కేటాయించకుంటే పేదలు తమ పార్టీ ఆధ్వర్యంలో వాటిని స్వాధీనం చేసుకొంటారని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని