అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర పోలీసు నియామక మండలి ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది.

Published : 21 May 2022 05:27 IST

విడుదల చేసిన పోలీస్‌ నియామక మండలి

ఈనాడు, హైదరాబాద్‌ : అగ్నిమాపక శాఖలో 225 డ్రైవర్‌ ఆపరేటర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్ర పోలీసు నియామక మండలి ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి మే 21వ తేదీ ఉదయం 8 గంటల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మే 26 రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కనీస విద్యార్హత ఇంటర్మీడియట్‌ అని వివరించింది. వయసు జులై 1, 2022 నాటికి 21 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే గరిష్ఠ వయో పరిమితి అయిదేళ్లు పెంచుతున్నట్లు తెలిపింది. ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేయాలని స్పష్టం చేసింది. దరఖాస్తులు ‌అందుబాటులో ఉంటాయని పేర్కొంది.  నోటిషికేషన్‌ తేదీ నాటికి రెండేళ్లు.. అంతకంటే ముందు హెవీ మోటర్‌ వెహికిల్‌ లైసెన్స్‌ పొంది ఉండాలి. రిజర్వేషన్‌, తదితర పూర్తి వివరాలు వెబ్‌సెట్‌లో ఉన్నాయని పేర్కొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని