Telangana News: ద్వితీయ ఇంటర్‌ ప్రశ్నపత్రం.. ఒక ప్రశ్న ముద్రించడం మరిచారు

ఇంటర్‌ పరీక్షల్లో ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. ఇంటర్‌బోర్డు చేసిన మరో తప్పు ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈనెల 12న ఇంటర్‌ రెండో సంవత్సరం వృక్షశాస్త్రం పరీక్ష జరగ్గా...

Updated : 21 May 2022 07:33 IST

ఆలస్యంగా వెలుగులోకి..

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షల్లో ఎన్నో తప్పిదాలు జరుగుతున్నాయి. ఇంటర్‌బోర్డు చేసిన మరో తప్పు ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈనెల 12న ఇంటర్‌ రెండో సంవత్సరం వృక్షశాస్త్రం పరీక్ష జరగ్గా... ఒక ప్రశ్నను ముద్రించడమే మరిచిపోయింది. ప్రశ్నపత్రంలోని సెక్షన్‌-ఏలో రెండు మార్కుల ప్రశ్నలు 15 ఇవ్వాలి. అందులో విద్యార్థులు ఏవైనా 10 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అందులో 14 ప్రశ్నలే ఇచ్చారు. తొమ్మిదో ప్రశ్న తర్వాత పదకొండోది ముద్రించారు. అంటే పదో ప్రశ్న మాయమైంది. ఆంగ్ల మాధ్యమంలో మాత్రం ముద్రించారు. ఈసారి ఛాయిస్‌ పెంచడంతో విద్యార్థులు కూడా పెద్దగా పట్టించుకోలేదని అధ్యాపకుడు ఒకరు తెలిపారు. ఇంటర్‌బోర్డు మాత్రం ఈసారి చిన్న చిన్న పొరపాట్లు జరిగాయని చెప్పుకుంటోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని