Published : 21 May 2022 05:27 IST

జీవిత ఆరోపణలు అవాస్తవం

గరుడవేగ చిత్ర నిర్మాత, డైరెక్టర్‌ వెల్లడి

తిరుపతి (గాంధీరోడ్డు), న్యూస్‌టుడే: సినీ నటి జీవిత తమపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని గరుడవేగ చిత్ర నిర్మాత, జీస్టర్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ వ్యవస్థాపకుడు కోటేశ్వరరాజు, డైరెక్టర్‌ హేమ అన్నారు. తిరుపతిలో వారు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. గరుడవేగలో వచ్చిన డబ్బును తాము తీసుకున్నామని చెబుతున్న జీవిత ఆధారాలతో నిరూపించాలని డిమాండ్‌ చేశారు. నగరి కోర్టు నుంచి ఆమెకు నాన్‌ బెయిల్‌ వారెంట్‌ వచ్చిందని, అప్పటి నుంచి పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నారని విమర్శించారు. ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా ఉన్న తమకు జరిగిన అన్యాయాన్ని, ఆవేదనను ఫిలిం ఛాంబర్‌ ద్వారా చెప్పుకోవటానికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ నెల 26న తమిళనాడులోని తిరువళ్లూరు కోర్టులో తుది తీర్పు ఉందని, అదేవిధంగా 27న నగరి కోర్టులో జరిగే విచారణకు జీవిత రాక తప్పదని స్పష్టం చేశారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని