గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఆక్సిజన్‌ ప్లాంటు

గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ప్లాంటును తెదేపా అధినేత చంద్రబాబు శనివారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు.

Published : 22 May 2022 05:02 IST

ఆన్‌లైన్‌లో ప్రారంభించిన చంద్రబాబు

ఈనాడు, హైదరాబాద్‌: గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్‌ ట్రస్టు ఏర్పాటుచేసిన ఆక్సిజన్‌ ప్లాంటును తెదేపా అధినేత చంద్రబాబు శనివారం ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. దీని ఏర్పాటుకు ట్రస్టు రూ.50 లక్షలు ఖర్చుచేసింది. ఇప్పటికే ఏపీలోని కుప్పం, టెక్కలిలలో ట్రస్టు ఆధ్వర్యంలో ఆక్సిజన్‌ ప్లాంట్లు అందుబాటులోకి వచ్చాయి. విపత్తుల సమయంలో ఎన్జీవోలు, ఇతర సంస్థలు, వ్యక్తులు ప్రభుత్వంతో కలిసి పని చేస్తే మంచి ఫలితాలు వస్తాయని ఈ సందర్భంగా చంద్రబాబు అన్నారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఎన్టీఆర్‌ ట్రస్టు సాధించిన విజయాలను వివరించారు. ట్రస్టు ద్వారా 11 వేల వైద్య శిబిరాలు నిర్వహించి సుమారు రూ.18 కోట్ల విలువైన మందులు, ఆహారంతోపాటు ఇతర సాయాన్ని బాధితులకు అందించినట్లు చంద్రబాబు తెలిపారు. ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన దాంట్లో కొంతైనా తిరిగి సమాజం కోసం ఖర్చు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ ట్రస్టు సీఈవో రాజేంద్రకుమార్‌, మహబూబాబాద్‌ అడిషనల్‌ కలెక్టర్‌ అభిలాషతోపాటు అసుపత్రి, ట్రస్టు సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని