Published : 22 May 2022 05:14 IST

సంగీత, నృత్య పరీక్షల నోటిఫికేషన్‌ విడుదల

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాల/పాఠశాలల వార్షిక పరీక్షలకు సంబంధించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పరీక్షల విభాగం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు సంబంధించిన విద్యార్థులకు 2022 జులై, ఆగస్టు మాసాల్లో పరీక్షలను నిర్వహిస్తామని వర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య సీహెచ్‌ మురళీకృష్ణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సాధారణ రుసుముతో 2022 జూన్‌ 22లోపు, రూ.1000 ఆలస్య రుసుముతో జూన్‌ 30లోపు దరఖాస్తులను సంబంధిత కళాశాల, పాఠశాలల్లో సమర్పించాల్సి ఉంటుందన్నారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని