కాజీపేట నుంచి దాదర్‌కు ప్రత్యేక రైళ్లు

కాజీపేట నుంచి మహారాష్ట్రలోని దాదర్‌(ముంబయి) వరకు దక్షిణ మధ్య(ద.మ.) రైల్వే వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. వేసవిలో కాజీపేట నుంచి నిజామాబాద్‌ మీదుగా బాసర సరస్వతీ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఇవి సౌకర్యవంతంగా

Published : 22 May 2022 05:14 IST

కాజీపేట, న్యూస్‌టుడే: కాజీపేట నుంచి మహారాష్ట్రలోని దాదర్‌(ముంబయి) వరకు దక్షిణ మధ్య(ద.మ.) రైల్వే వేసవిలో ప్రత్యేక రైళ్లను నడపనుంది. వేసవిలో కాజీపేట నుంచి నిజామాబాద్‌ మీదుగా బాసర సరస్వతీ పుణ్యక్షేత్రానికి వెళ్లాలనుకునే భక్తులకు ఇవి సౌకర్యవంతంగా ఉండనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు కాజీపేట జంక్షన్‌ నుంచి పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, ఆర్మూర్‌, నిజామాబాద్‌, బాసర, ధర్మాబాద్‌ మీదుగా దాదర్‌(ముంబయి) వెళ్తాయని శనివారం ద.మ. రైల్వే అధికారులు తెలిపారు. వేసవి రద్దీ దృష్ట్యా రైల్వే అధికారులు 22 ప్రత్యేక రైళ్లను నడపనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని