Published : 22 May 2022 05:14 IST

డీఎస్పీ, డీఎస్‌జే, ఏఈఎస్‌ పోస్టులకు వయోపరిమితి పెంపు

ఈనాడు, హైదరాబాద్‌: గ్రూప్‌-1 నోటిఫికేషన్లోని డీఎస్పీ, డిప్యూటీ సూపరింటెండెంట్‌ జైలర్‌ (డీఎస్‌జే- మెన్‌), సహాయ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ (ఏఈఎస్‌) పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 31 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెరిగిందని టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డీఎస్పీ, ఏఈఎస్‌ పోస్టుల ఎత్తులోనూ మార్పులు చేశామని పేర్కొన్నారు. పురుష అభ్యర్థుల ఎత్తును 167.6 సెం.మీ. నుంచి 165 సెం.మీ.కు, మహిళా అభ్యర్థులకు 152.5 సెం.మీ. నుంచి 150 సెం.మీ.కు తగ్గించినట్లు వివరించారు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని, అర్హత కలిగిన అభ్యర్థులు గ్రూప్‌-1కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం నాటికి గ్రూప్‌-1కు 1,74,938 దరఖాస్తులు వచ్చాయని వివరించారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని