Published : 22 May 2022 05:14 IST

పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా ఇంజినీర్ల ఎంపికలు!

ఈనాడు, హైదరాబాద్‌: నీటిపారుదల, పంచాయతీరాజ్‌, రహదారులు-భవనాలు, ప్రజారోగ్య శాఖల పరిధిలో ఇంజినీర్ల ఎంపిక ప్రక్రియను రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) ద్వారా నిర్వహించాలని భావిస్తున్నారు. ఈ శాఖల పరిధిలో ఖాళీగా ఉన్న ఇంజినీర్ల పోస్టులు, ఎంపిక ప్రక్రియపై శనివారం నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్‌ నేతృత్వంలో జలసౌధలో  సమావేశం జరిగింది. శాఖల కార్యదర్శులు, ఈఎన్‌సీలు పాల్గొన్నారు. కార్యనిర్వాహక ఇంజినీర్లు, సహాయ కార్యనిర్వాహక ఇంజినీర్లు కలిపి ఈ శాఖల పరిధిలో దాదాపు రెండువేల వరకు ఖాళీలున్నాయి. ఇంజినీరింగ్‌ శాఖలు జేఎన్‌టీయూ లాంటి సంస్థల సహకారంతో ఎంపిక నిర్వహించాలా లేక టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలా అనే అంశాలపై చర్చ జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించి విధి, విధానాలను రూపొందించినట్లు సమాచారం.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని