
విత్తు ధరలో సగమైనా పంటకు రాదాయె!
ధాన్యం మద్దతు ధర రూ.1960 మాత్రమే
కానీ క్వింటా విత్తనాలు రూ.4,400
ఈనాడు, హైదరాబాద్: అన్నదాతలను విత్తన ధరలు భయపెడుతున్నాయి. వానాకాలం(ఖరీఫ్) సీజన్‌కు వచ్చేనెల మొదటివారం నుంచి విక్రయించే పలురకాల విత్తనాల రేట్లు భారీగా పెరుగుతున్నాయి. పత్తి తరవాత అరకోటి ఎకరాలకు పైగా సాగయ్యే వరి విత్తనాల గరిష్ఠ ధర క్వింటాకు రూ.4,400కి చేరింది. ఒక్కో బ్రాండును బట్టి రూ.3200 నుంచి 4400 రూపాయల వరకు రేట్లను కంపెనీలు నిర్ణయించాయి. ఏ గ్రేడ్ ధాన్యం ధర క్వింటాకు రూ.1960 ఇవ్వాలని కేంద్రం 2021 జూన్‌లో ప్రకటించింది. వరి క్వింటా విత్తనాల ధరలో కనీసం సగానికి సగమైనా రైతు పండించే ధాన్యానికి లేదు. విత్తన పంట సాగు ఖర్చులు బాగా పెరిగినందున ధరలు పెంచుతున్నట్లు ప్రైవేటు కంపెనీలు చెబుతున్నాయి. ఇంకా మొక్కజొన్న, సోయాచిక్కుడు వంటి పంటల విత్తనాల రేట్లు రైతులను బెంబేలెత్తిస్తున్నాయి. మొక్కజొన్న పంటలో మాధురి, బీపీసీహెచ్-6 అనే పేరుగల వంగడాలైతే క్వింటా ధర ఏకంగా రూ.40 వేలు పలుకుతోంది. వీటిని ఎకరానికి 8 కిలోలే వేస్తారని, రైతులపై భారం ఉండదని కంపెనీలు చెబుతున్నాయి.
24న మేళాలు
పరిశోధనల ద్వారా పండించిన నాణ్యమైన విత్తనాలను విక్రయించే ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తాజాగా ధరలు ఖరారు చేసింది. ఈ నెల 24న రాజేంద్రనగర్, జగిత్యాల జిల్లా పొలాస, పాలెం(నాగర్‌కర్నూల్ జిల్లా), తోర్నాల(సిద్దిపేట), నత్నాయిపల్లి, ఆదిలాబాద్, మల్యాల, తాండూరు, ముథోల్, వరంగల్ విశ్వవిద్యాలయ ప్రాంతీయ పరిశోధన కేంద్రాల్లో ఈ విత్తనాలను రైతులకు నేరుగా విక్రయించేందుకు ‘విత్తన మేళా’లు ఏర్పాటు చేస్తున్నట్లు వర్సిటీ వెల్లడించింది. 8 రకాల పంటలకు సంబంధించిన 44 రకాల మేలైన వంగడాలు 15 వేల క్వింటాళ్లను రైతులకు అమ్మనున్నట్లు జయశంకర్ ఉపకులపతి(వీసీ) ప్రవీణ్‌రావు చెప్పారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్..
-
General News
E-Mobility: టేబుల్ మీద తింటూ.. టేబుల్‌తో సహా ప్రయాణించి..!
-
Politics News
Telangana News: ఆపరేషన్ ఆకర్ష్.. భాజపాలో ఈటలకు కొత్త బాధ్యతలు!
-
India News
Delhi Assembly: 66శాతం పెరిగిన దిల్లీ ఎమ్మెల్యేల జీతం.. నెలకు ఎంతంటే..?
-
Politics News
Maharashtra: ఉద్ధవ్ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- బిగించారు..ముగిస్తారా..?
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు