Published : 23 May 2022 04:16 IST

తెలంగాణ, తమిళనాడుల్లో ఒమిక్రాన్‌ ఉపరకాలు

ఇన్సాకాగ్‌ వెల్లడి

దిల్లీ: కరోనాలోని ఒమిక్రాన్‌ ఉపరకాలు బీఏ.4, బీఏ.5లు భారత్‌లో ప్రవేశించాయని వైరస్‌ జన్యుక్రమ పరిశీలన కన్సార్షియం ‘ఇన్సాకాగ్‌’ ధ్రువీకరించింది. వీటి సాంక్రమిక శక్తి చాలా ఎక్కువని తెలిపింది. తెలంగాణకు చెందిన 80 ఏళ్ల వ్యక్తికి బీఏ.5 సోకినట్లు పేర్కొంది. ఆయనలో వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని, ఇప్పటికే పూర్తిస్థాయిలో వ్యాక్సిన్‌ పొందారని వివరించింది. తమిళనాడుకు చెందిన 19 ఏళ్ల యువతికి బీఏ.4 సోకినట్లు తెలిపింది. ఆమెకూ వ్యాధి లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని వెల్లడించింది. హైదరాబాద్‌ వచ్చిన దక్షిణాఫ్రికా జాతీయుడొకరిలో ఈ వేరియంట్‌ను ఇప్పటికే గుర్తించినట్లు పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యగా.. బాధితులకు సన్నిహితంగా వచ్చినవారిని గుర్తించే ప్రక్రియను చేపట్టినట్లు తెలిపింది.

దేశంలో కొత్తగా 2,226 కొవిడ్‌ కేసులు..
దేశంలో రోజువారీ కొవిడ్‌ కేసుల సంఖ్య ఆదివారం స్వల్పంగా తగ్గింది. కొత్తగా 2,226 మంది వైరస్‌ బారిన పడగా.. 65 కొవిడ్‌ మరణాలు నమోదయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే 97 కేసులు తగ్గాయి. క్రియాశీలక కేసుల సంఖ్య 14,955కి చేరింది. రోజువారీ పాజిటివిటీ రేటు 0.50% నమోదైంది.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని