నగరంలో మట్టి కుండలు.. పల్లెల్లో ప్లాస్టిక్‌ బిందెలు

ఎండాకాలం నేపథ్యంలో హైదరాబాద్‌లో మట్టి కుండలకు డిమాండ్‌ పెరుగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.

Published : 23 May 2022 04:16 IST

ఎండాకాలం నేపథ్యంలో హైదరాబాద్‌లో మట్టి కుండలకు డిమాండ్‌ పెరుగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సాధారణంగా మట్టి కుండలు, వివిధ లోహాలతో తయారు చేసిన నీటి పాత్రలు ఎక్కువగా వాడే గ్రామాల్లో కొన్నేళ్లుగా వాటి డిమాండ్‌ తగ్గుతోంది. నీటిని మోసేందుకు, వివిధ అవసరాలకు తేలికగా ఉండడంతో పాటు చౌకగా లభించే ప్లాస్టిక్‌ బిందెల వినియోగం పెరుగుతోంది. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌లో విక్రయానికి తెచ్చిన కుండలను.. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్‌లో అమ్మకానికి తీసుకెళుతున్న ప్లాస్టిక్‌ బిందెలను పై చిత్రాల్లో చూడవచ్చు.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని