చెత్తకు నిప్పు.. పచ్చదనానికి ముప్పు!

పచ్చదనం పెంపునకు శ్రీకారం చుడితే చాలదు.. సంరక్షణకూ అంతే ప్రాధాన్యమివ్వాలి.. లేదంటే చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు చందమే అవుతుంది.

Published : 23 May 2022 04:16 IST

పచ్చదనం పెంపునకు శ్రీకారం చుడితే చాలదు.. సంరక్షణకూ అంతే ప్రాధాన్యమివ్వాలి.. లేదంటే చేసిన కృషి అంతా బూడిదలో పోసిన పన్నీరు చందమే అవుతుంది. శంషాబాద్‌ కాముని చెరువు కట్టపై హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కిలోమీటర్‌ పొడవునా మొక్కలు నాటారు. అవి పెరిగి పెద్దవై పచ్చదనాన్ని సంతరించుకునే సమయంలో ఎవరో వ్యక్తులు చెరువు కట్ట పక్కన చెత్తకు నిప్పుపెట్టారు. ఆ వేడికి అయిదు వందల వరకు పచ్చని చెట్ల ఆకులు ఇలా నిలువునా మాడిపోయాయి.

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని