నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు

రాయలసీమ ప్రాంతంపై 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది.

Published : 23 May 2022 04:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాయలసీమ ప్రాంతంపై 3.1 కిలోమీటర్ల ఎత్తున గాలులతో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఆదివారం బలహీనపడిందని వాతావరణశాఖ తెలిపింది. బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు నెమ్మదిగా ముందుకు విస్తరిస్తున్నాయి. సోమ, మంగళవారాల్లో తెలంగాణలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఆదివారం పగలు అయిదు చోట్ల స్వల్పంగా వర్షాలు కురిశాయి. పగటివేళ అత్యధికంగా గార్ల (మహబూబాబాద్‌ జిల్లా)లో 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని