కాలుష్య రహిత పారిశ్రామిక ప్రగతి

కాలుష్యం లేని ఇంధనం, పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్‌ తెలిపారు.  దావోస్‌లో ప్రపంచ ఆర్థిక

Published : 23 May 2022 04:16 IST

ఆ దిశగా ఏపీ అడుగులు

దావోస్‌లోని డబ్ల్యూఈఎఫ్‌ వేదికలో ఆ రాష్ట్ర సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: కాలుష్యం లేని ఇంధనం, పారిశ్రామిక ప్రగతి వైపు అడుగులు వేయడానికి ఏపీ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్‌ తెలిపారు.  దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సు(డబ్ల్యూఈఎఫ్‌)లో మొదటి రోజు ఆయన పాల్గొని పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి  తీసుకున్న చర్యలపై డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు క్లాజ్‌ష్వాప్‌కు సీఎం వివరించారు.  అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ భాగస్వామ్యంపై డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. వైద్యరంగంలో వినూత్న ఆవిష్కరణలపై కలిసి పనిచేసే విషయమై డబ్ల్యూఈఎఫ్‌ ఆరోగ్యం-వైద్య విభాగాధిపతి డాక్టర్‌ శ్యాం బిషేన్‌తో చర్చించారు. రవాణా రంగంలో మార్పులపై డబ్ల్యూఈఎఫ్‌ మొబిలిటీ, సస్టెయినబులిటీ విభాగాధిపతి ఫెడ్రో గోమెజ్‌తో చర్చించారు. ఈ రంగంలో సహకారానికి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. బీసీజీ గ్లోబల్‌ ఛైర్మన్‌ హాన్స్‌పాల్‌ బక్నర్‌, అదానీ గ్రూప్‌ ఛైర్మన్‌ గౌతంఅదానీతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని