విభజన హామీలను అమలు చేయాలి

ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని తెలుగు రాష్ట్రాలు డిమాండ్‌ చేశాయి. దక్షిణ భారత

Published : 24 May 2022 04:19 IST

 డిమాండ్‌ చేయనున్న తెలుగు రాష్ట్రాలు

28న దక్షిణ భారత ప్రాంతీయ మండలి సమావేశం

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలుచేయాలని, అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని తెలుగు రాష్ట్రాలు డిమాండ్‌ చేశాయి. దక్షిణ భారత రాష్ట్రాల ప్రాంతీయ మండలి స్థాయీ కమిటీ సమావేశం ఈ నెల 28న కేరళ రాజధాని తిరువనంతపురంలో జరగనుంది. ఏపీ, తెలంగాణలతో పాటు కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి ఇందులో పాల్గొంటాయి. ఈ సమావేశానికి సంబంధించిన ఎజెండాను కేంద్ర హోంశాఖకు చెందిన అంతర్రాష్ట్ర కౌన్సిల్‌ అన్ని రాష్ట్రాలకు పంపింది. 2021 నవంబరు 14న తిరుపతిలో జరిగిన సమావేశంలో మొత్తం 45 అంశాలపై చర్చించగా.. వాటిలో 19 పరిష్కారమయ్యాయని, మరో 26పై చర్యలు తీసుకుంటున్నట్లు కౌన్సిల్‌ తెలిపింది. కాగా, తిరువనంతపురంలో జరిగే సమావేశంలో 59 అంశాలపై చర్చించాలని సభ్య రాష్ట్రాలు ప్రతిపాదించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని