పరిమితికి మించి పరిహారాన్ని ఆమోదించలేం

కొనుగోలు చేసిన యంత్రం సరిగా పనిచేయనప్పుడు..  దాని పరిమితికి మించి పరిహారం అడిగితే అనుమతించలేమని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. 2012లో అల్కారా ఎకో నేచురల్‌ వాటర్‌ సొల్యూషన్స్‌ నుంచి కొనుగోలు చేసిన

Published : 24 May 2022 04:55 IST

రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ తీర్పు

ఈనాడు, హైదరాబాద్‌: కొనుగోలు చేసిన యంత్రం సరిగా పనిచేయనప్పుడు..  దాని పరిమితికి మించి పరిహారం అడిగితే అనుమతించలేమని రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ స్పష్టం చేసింది. 2012లో అల్కారా ఎకో నేచురల్‌ వాటర్‌ సొల్యూషన్స్‌ నుంచి కొనుగోలు చేసిన స్టీమ్‌ స్పా యంత్రాన్ని 2018లో, 2019లో మరమ్మతులు చేయించినా సరిగా పనిచేయకపోవడంతో పరిహారం, నష్టం కింద రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశాలు జారీచేయాలంటూ హైదరాబాద్‌కు చెందిన వి.పవన్‌కిరణ్‌ జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు దాఖలు చేశారు. దీన్ని జిల్లా ఫోరం ప్రాథమిక దశలోనే తిరస్కరిస్తూ ఉత్తర్వులు జారీచేయగా.. ఆయన రాష్ట్ర వినియోగదారుల కమిషన్‌ను ఆదేశించారు. దీనిపై కమిషన్‌ అధ్యక్షుడు జస్టిస్‌ ఎమ్మెస్కే జైశ్వాల్‌, సభ్యురాలు మీనారామనాథన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టి తీర్పు వెలువరించింది. జిల్లా ఫోరం ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి ఎలాంటి కారణాలు లేవంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని