వైద్య విద్యార్థిని సింధూరకు రూ.2 లక్షల సాయం

ఎంబీబీఎస్‌ సీటు సాధించినా, ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఓ నిరుపేద విద్యార్థినికి టీఎస్‌ ఆన్‌లైన్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ

Published : 24 May 2022 04:55 IST

‘ఈనాడు’ వార్తకు స్పందన

వెల్దండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎంబీబీఎస్‌ సీటు సాధించినా, ఫీజు చెల్లించలేక ఇబ్బంది పడుతున్న ఓ నిరుపేద విద్యార్థినికి టీఎస్‌ ఆన్‌లైన్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్‌) కింద రూ.2 లక్షల ఆర్థిక సాయాన్ని అందించింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలోని రాచూరుకు చెందిన కొమ్ము సింధూర నీట్‌ ర్యాంకు ద్వారా మహబూబ్‌నగర్‌ ఎస్వీఎస్‌ వైద్య కళాశాలలో సీటు సాధించింది. రుసుం చెల్లించేందుకు ఇబ్బంది పడుతోండటంతో ‘ఈనాడు’ ప్రధాన సంచికలో ఏప్రిల్‌ 7న ‘మెడికల్‌ సీటొచ్చినా.. గుదిబండలా పేదరికం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన టాటా గ్రూప్‌ సంస్థ టీసీఎస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాజన్నతమ గ్రూప్‌లోని ‘టీఎస్‌ ఆన్‌లైన్‌’ సీఎస్‌ఆర్‌ కార్యక్రమంలో సాయం అందించేందుకు సిఫార్సు చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని టీసీఎస్‌ ప్రాంగణంలో సింధూరకు రూ.2 లక్షలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని టీసీఎస్‌ హైటెక్‌ గ్లోబల్‌ హెడ్‌ వి.రాజన్న, మోహన్‌ ఫౌండేషన్‌ తెలంగాణ అధిపతి లలితా రఘురాం, టీఎస్‌ ఆన్‌లైన్‌ సీఓఓ ఇ.సతీష్‌లు అందించారు. సింధూర, ఆమె కుటుంబసభ్యులు వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని