రైస్‌మిల్లర్లకు వ్యతిరేకంగా అన్నదాతల ఆగ్రహం

ధాన్యం సేకరణలో తరుగు పేరుతో రైస్‌మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారంటూ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూరు సొసైటీ పరిధి.. మచ్చర్ల గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిజామాబాద్‌

Updated : 24 May 2022 05:54 IST

నిజామాబాద్‌ కలెక్టరేట్‌ ఎదుట నిరసన

ఈనాడు, నిజామాబాద్‌: ధాన్యం సేకరణలో తరుగు పేరుతో రైస్‌మిల్లర్లు దోపిడీకి పాల్పడుతున్నారంటూ నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం ఆలూరు సొసైటీ పరిధి.. మచ్చర్ల గ్రామానికి చెందిన రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిజామాబాద్‌ కలెక్టరేట్‌కు తరలివచ్చారు. గేటు ఎదుట బైఠాయించి నినాదాలు చేశారు. వడ్లలో తాలు ఉందంటూ 5 కిలోల తరుగు అడుగుతున్నారని, లారీలు దించుకోవడంలో మిల్లుల యాజమాన్యాలు కొర్రీలు పెడుతున్నాయని వాపోయారు. తూకం వేసిన ధాన్యం మిల్లులకు చేరడానికి 4 రోజులు పడుతోందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఆలస్యంతో వర్షాలు కురిస్తే.. తామంతా నష్టపోవాల్సి ఉంటుందన్నారు. కార్యాలయం లోపలికి వెళ్లేందుకు రైతులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సమస్య పరిష్కారానికి చొరవచూపాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఆయన హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని