CM KCR: హైదరాబాద్‌కు చేరుకున్న కేసీఆర్‌.. పలువురితో చర్చలు, భేటీలు వాయిదా..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన ముగిసింది. సోమవారం రాత్రి ఆయన దిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 20న దిల్లీ వెళ్లిన ఆయన ఈ నెల 21న ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ

Updated : 24 May 2022 07:38 IST

ముగిసిన సీఎం దిల్లీ పర్యటన

ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిల్లీ పర్యటన ముగిసింది. సోమవారం రాత్రి ఆయన దిల్లీ నుంచి బయల్దేరి హైదరాబాద్‌కు చేరుకున్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 20న దిల్లీ వెళ్లిన ఆయన ఈ నెల 21న ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌తో భేటీ అయ్యారు. ఈ నెల 22న దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. పలు అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు సీఎంలు వారి బృందాలతో చండీగఢ్‌కు వెళ్లారు. జాతీయ రైతు ఉద్యమంలో అసువులు బాసిన సుమారు 600 రైతు కుటుంబాలను సీఎం కేసీఆర్‌ పరామర్శించారు. వారికి ఆర్థికంగా భరోసానిచ్చేలా ఒక్కో కుటుంబానికి రూ.3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. 24, 25 తేదీల్లో పలువురు ప్రముఖులతో చర్చలు, భేటీలు జరగాల్సి ఉన్నా... సీఎం వాటిని వాయిదా వేసి హైదరాబాద్‌కు వచ్చారు. మంగళ, బుధవారాల్లో సమావేశాల నిర్వహణతో పాటు కొందరు సన్నిహితుల కుటుంబాల్లో పెళ్లిళ్లకు ఆయన హాజరయ్యే వీలుంది. ఈ నెల 25న ఆయన బెంగళూరు వెళ్తారు. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ అవుతారు. 27న మహారాష్ట్రలోని రాలెగావ్‌ సిద్ధికి వెళ్లి సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేతో భేటీ అవుతారు. అదే రోజు శిరిడీ పుణ్యక్షేత్రం వెళ్లి సాయిబాబాను దర్శించుకుని, మళ్లీ హైదరాబాద్‌కు వస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని