Published : 24 May 2022 05:07 IST

తెలుగునాట ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాలు

28న ‘ఎన్టీఆర్‌ మహోన్నతుడు’ లఘుచిత్ర ప్రదర్శన

ఈనాడు, హైదరాబాద్‌: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, మహానటుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో నెలకొక ప్రాంతంలో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ఎన్టీఆర్‌ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద మే 28న ఉదయం 7.30 గంటలకు ‘‘ఎన్టీఆర్‌ మహోన్నతుడు’’ లఘుచిత్ర ప్రదర్శనతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. తిరుపతి, ఒంగోలు, విజయవాడ, రాజమహేంద్రవరం, విశాఖపట్టణం, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా సాహిత్యం, సామాజిక సేవ, ప్రజాప్రాతినిధ్యం, వ్యవసాయం, కళలు(నాటకం, నాట్యం, సంగీతం, గానం), విద్య, వైద్యం తదితర రంగాల్లో కృషిచేసిన ప్రముఖులకు ఎన్టీఆర్‌ గౌరవ పురస్కారాలు అందజేస్తామన్నారు. తిరుపతిలో జూన్‌ 4వ తేదీ ఉదయం 10.30 గంటలకు మేడసాని మోహన్‌ అవధాన కార్యక్రమం, హైదరాబాద్‌, విజయవాడల్లో నిర్వహించే భారీ కార్యక్రమాల్లో, ఎన్టీఆర్‌తో నటించిన సహచర నటీనటులు, రాజకీయ ప్రముఖులను సత్కరించనున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్‌ చిత్రంతో రూ.100 స్మారక నాణెం ముద్రించాలని కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని చెప్పారు. సావనీర్‌ ముద్రణ, వివిధ దేశాల్లో ఉత్సవాలు నిర్వహించే వారితో అనుసంధానం తదితర కార్యక్రమాలు ఉంటాయని పురందేశ్వరి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని