
Published : 24 May 2022 05:07 IST
బాధ్యతలు స్వీకరించిన నర్సింగ్‌రావు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శిగా నందికొండ నర్సింగ్‌రావు సోమవారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ ప్రిన్సిపల్ జిల్లా సెషన్స్ జడ్జిగా వ్యవహరిస్తున్న ఆయన్ను రాష్ట్ర ప్రభుత్వం గత వారంలో న్యాయశాఖ కార్యదర్శిగా నియమించిన విషయం తెలిసిందే. ఆ మేరకు బాధ్యతలు స్వీకరించిన ఆయన న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని హైదరాబాద్ అరణ్యభవన్‌లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
► Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.
Advertisement
Tags :