నేటితో ముగియనున్న ఇంటర్‌ పరీక్షలు

రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జూన్‌ 20లోగా ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది.

Published : 24 May 2022 05:07 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇంటర్‌ పరీక్షలు మంగళవారంతో ముగియనున్నాయి. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. జూన్‌ 20లోగా ఫలితాలను వెల్లడించేందుకు ఇంటర్‌ బోర్డు కసరత్తు చేస్తోంది. ఈ నెల 12 నుంచి రాష్ట్రంలోని 14 కేంద్రాల్లో మూల్యాంకనం చేపడుతోంది. ఈ ఏడాది కొత్తగా మంచిర్యాల, నిర్మల్‌ జిల్లాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసింది. జూన్‌ రెండో వారం చివరి నాటికి స్పాట్‌ వాల్యుయేషన్‌ పూర్తి చేయాలని బోర్డు లక్ష్యంగా పెట్టుకుంది. సోమవారం ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మోడ్రన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌-1, జాగ్రఫీ పేపర్‌-1 పరీక్షలు జరిగాయి. వీటికి 490 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 471 మంది హాజరయ్యారని బోర్డు కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని