
మంకీ పాక్స్‌పై అప్రమత్తం
ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చి..
లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు
21 రోజులు ఐసొలేషన్‌లో ఉంచాలి
జిల్లా వైద్యాధికారులకు ఆరోగ్య శాఖ ఆదేశాలు
ఈనాడు, హైదరాబాద్: మశూచిని పోలిఉండే వైరల్ వ్యాధి మంకీపాక్స్‌పై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. 80 దేశాల్లో ఈ కేసులు నమోదవుతుండడం, వివిధ దేశాల నుంచి రాష్ట్రానికి రాకపోకలు ఎక్కువగా ఉంటున్న నేపథ్యంలో అన్ని జిల్లాల వైద్యాధికారులకు పలు సూచనలు చేసింది. ప్రస్తుతం ఈ కేసులు మన వద్ద నమోదు కాకపోయినా, ముందు జాగ్రత్తల ద్వారా వైరస్ వ్యాప్తిని నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ కేసులు నమోదైన దేశాలకు గత మూడు వారాల్లో వెళ్లివచ్చిన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే.. వారి రక్తం, లాలాజలం నమూనాలు సేకరించాలని స్పష్టం చేసింది. వాటిని పుణెలోని జాతీయ వైరాలజీ ల్యాబ్‌కు పంపి పరీక్షస్తారు. సంబంధితులను ఐసొలేషన్ చేయడంతో పాటు వారు ఎవరెవర్ని కలిశారో వివరాలు సేకరించాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కరోనా కేసుల్లో లానే కాంటాక్టులను గుర్తించి వారూ 21 రోజులపాటు ఐసొలేషన్‌లో ఉండేలా చూడాలంది.
ఈ లక్షణాలు కనిపిస్తే..
ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, శరీరంపై వాపు.. వెన్ను, కండరాల్లో నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. తర్వాత జ్వరం పెరిగి శరీరమంతా దద్దుర్లు వస్తాయి. అవి చిట్లి పుండ్లవుతాయి. అతికొద్ది మందిలోనే ఇది విషమంగా మారుతుంది. నోరు, ముక్కు, చర్మం నుంచి ఈ వైరస్ శరీరంలోకి చేరుతుంది. 7-14 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండటం, వారి దుస్తులు వాడటం, ఆ వ్యక్తి శరీర స్రావాల ద్వారా ఇతరులకు సోకుతుంది. చేతిశుభ్రత పాటించడం, మాస్క్, ఫేస్‌షీల్డ్ వంటివి ధరించాలి.
అప్రమత్తంగా ఉన్నాం
మంకీపాక్స్‌తో భయం అవసరం లేదు. ఆ కేసులు నమోదైన దేశాల నుంచి వచ్చినవారు కొన్ని రోజులు ఇంటికే పరిమితం కావాలి. లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వానికి సమాచారం అందించి చికిత్స పొందాలి.
-డా.రాజారావు,సూపరింటెండెంట్, గాంధీ ఆసుపత్రి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Telangana News: కాంగ్రెస్ గూటికి తెరాస మేయర్.. రాహుల్ సమక్షంలో చేరిక
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Sports News
IND vs ENG: శార్దూల్ ఔట్.. టీమ్ఇండియా ఏడో వికెట్ డౌన్
-
World News
Turkey: టర్కీ అదుపులో రష్యా ధాన్యం రవాణా నౌక
-
Movies News
Naga Chaitanya: నేను ఏదైనా నేరుగా చెప్తా.. ద్వంద్వార్థం ఉండదు: నాగచైతన్య
-
Business News
Start Ups: ఈ ఏడాది స్టార్టప్‌లలో 60 వేల ఉద్యోగాల కోత!
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!