Tirumala: రేపు వయోవృద్ధులు, దివ్యాంగుల ప్రత్యేక దర్శన కోటా విడుదల

వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్‌ నెల ప్రత్యేక దర్శన కోటాను గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో

Updated : 25 May 2022 07:26 IST

తిరుమల, న్యూస్‌టుడే: వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా జూన్‌ నెల ప్రత్యేక దర్శన కోటాను గురువారం మధ్యాహ్నం 3గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఆన్‌లైన్‌లో టోకెన్లు బుక్‌ చేసుకున్న భక్తులను ప్రస్తుతం రోజూ ఉదయం 10గంటల స్లాట్‌లో దర్శనానికి అనుమతిస్తున్నారు. జూన్‌ 1 నుంచి మధ్యాహ్నం 3 గంటల స్లాట్‌లో అనుమతిస్తారు. ఆగస్టు నెలకు సంబంధించిన గదుల కోటా గురువారం ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల కానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని