Published : 25 May 2022 05:09 IST

సకాలంలో నామినీ వివరాలు నమోదు చేయండి

 ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్టీసీ ఉద్యోగులంతా తమ పీఎఫ్‌ ఖాతాలకు సంబంధించి నామినీ వివరాలను ఈపీఎఫ్‌ పోర్టల్‌లో సకాలంలో నమోదు చేయాలని సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ కోరారు. దీనిపై ఉద్యోగుల్లో మరింత అవగాహన కల్పించేందుకు డిపో స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ-నామినేషన్‌ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవగాహన కోసం పీఎఫ్‌ అధికారులతో బుధవారం బస్‌భవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జనార్‌ మాట్లాడుతూ.. పదవీవిరమణ సమయంలో ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగాలంటే ఈ ప్రక్రియ అనివార్యమన్నారు. సాధ్యమైనంత త్వరగా దీన్ని పూర్తి చేయాలని కోరారు. సమావేశంలో పీఎఫ్‌ ప్రాంతీయ కమిషనర్‌ వంశీకృష్ణ, సహాయ కమిషనర్‌ రామ్మోహన్, ఆర్టీసీ అధికారులు విజయపుష్ప, జి.యుగంధర్, అన్ని రీజియన్లకు సంబంధించిన మానవవనరుల విభాగం అధికారులు పాల్గొన్నారు. 

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని