రెండేళ్లలో 5,240 మెడికల్‌ సీట్లు

రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఎనిమిది వైద్య కళాశాలల్లో 2.840 సీట్లు భర్తీ కానున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏడేళ్ల వ్యవధిలో 700 సీట్ల నుంచి ఈ స్థాయికి చేరామన్నారు.

Published : 25 May 2022 05:09 IST

హరీశ్‌రావు 

సిద్దిపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వచ్చే విద్యాసంవత్సరంలో ఎనిమిది వైద్య కళాశాలల్లో 2.840 సీట్లు భర్తీ కానున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఏడేళ్ల వ్యవధిలో 700 సీట్ల నుంచి ఈ స్థాయికి చేరామన్నారు. వచ్చే రెండేళ్లలో వైద్య సీట్ల సంఖ్య 5,240కి పెరగనుందని తెలిపారు. సిద్దిపేటలోని తెలంగాణ డయాగ్నొస్టిక్‌ కేంద్రానికి అనుబంధంగా రేడియాలజీ విభాగాన్ని మంత్రి మంగళవారం ప్రారంభించారు. రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి డబ్బు వృథా చేసుకోవద్దని, అన్ని సదుపాయాలున్న ప్రభుత్వ దవాఖానాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డయాగ్నొస్టిక్‌ హబ్‌ల ద్వారా రానున్న రోజుల్లో 134 రకాల పరీక్షలు చేయనున్నామని చెప్పారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాల, డయాగ్నొస్టిక్‌ హబ్, రేడియాలజీ విభాగాలను అందుబాటులోకి తేనున్నామన్నారు.  ‘స్టెమీ’ కార్యక్రమం కింద రాష్ట్రవ్యాప్తంగా హృద్రోగులకు తక్షణ ప్రాథమిక సేవలు అందిస్తున్నామన్నారు. రూ.40 వేల విలువైన ఇంజెక్షన్‌ను ఉచితంగానే ఇస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని