TS Gruop 1 Applications: 2 లక్షలు దాటిన గ్రూప్‌-1 దరఖాస్తులు

రాష్ట్రంలో గ్రూప్‌-1 దరఖాస్తులు 2 లక్షలు దాటాయి. ఈ నెల 2న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవగా మంగళవారం రాత్రి 2,00,428 దాటినట్లు కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈ నెల 31తో ముగియనుంది.

Updated : 12 Oct 2022 11:46 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-1 దరఖాస్తులు 2 లక్షలు దాటాయి. ఈ నెల 2న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవగా మంగళవారం రాత్రి 2,00,428 దాటినట్లు కమిషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దరఖాస్తుల సమర్పణకు గడువు ఈ నెల 31తో ముగియనుంది. ఇటీవల ప్రభుత్వం గ్రూప్‌-1లో యూనిఫాం పోస్టులైన డీఎస్పీ, డీఎస్‌జే, ఏఈఎస్‌ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితి 31 ఏళ్ల నుంచి 33 ఏళ్లకు పెంచింది. డీఎస్పీ, ఏఈఎస్‌ పోస్టులకు పోటీపడే పురుష, మహిళా అభ్యర్థులకు ఎత్తును తగ్గించింది. అర్హులైన అభ్యర్థులు చివరిరోజు వరకు వేచి చూడకుండా వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

పదోతరగతి ద్వితీయ భాష పరీక్షకు 4,890 మంది గైర్హాజరు
పదోతరగతి పరీక్షల్లో మంగళవారం జరిగిన ద్వితీయ భాష పరీక్షకు 4,890 మంది గైర్హాజరయ్యారు. 5,08,143 మందికి గాను 5,03,253 మంది (99.04%) పరీక్ష రాశారు. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడుతూ నల్గొండ జిల్లాలో నలుగురు విద్యార్థులు పట్టుబడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని