జగన్, కేటీఆర్‌ల భేటీ

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌లు చాలా రోజుల తర్వాత కలిశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన

Published : 25 May 2022 05:15 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌లు చాలా రోజుల తర్వాత కలిశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు హాజరైన వారిద్దరూ అక్కడ మంగళవారం భేటీ అయ్యారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుని, ఆలింగనం చేసుకున్నారు. ఇరు రాష్ట్రాల్లో పెట్టుబడుల సాధన చర్యలపై చర్చించుకున్నారు. ‘ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో గొప్ప సమావేశం జరిగింది’ అంటూ మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. 

మహారాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆదిత్యఠాక్రే తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. రెండు రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు ఉన్న అవకాశాలపై వారిద్దరూ చర్చించారు. ఏపీ ఐటీ, పరిశ్రమల మంత్రి  గుడివాడ అమర్‌నాథ్‌ తెలంగాణ పెవిలియన్‌కు వచ్చి మంత్రి కేటీఆర్‌ను కలిశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని