‘సోలార్‌’జంగ్‌ మ్యూజియం

హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ పురావస్తు పరిశోధన కేంద్రం. నిత్యం వేలమంది సందర్శించే ఈ మ్యూజియం సదా విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతుంటుంది. విద్యుత్తు వినియోగమూ ఎక్కువే.

Updated : 25 May 2022 05:31 IST

దేశంలోనే మూడో అతి పెద్దది 

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని సాలార్‌జంగ్‌ పురావస్తు పరిశోధన కేంద్రం. నిత్యం వేలమంది సందర్శించే ఈ మ్యూజియం సదా విద్యుద్దీప కాంతుల్లో మెరిసిపోతుంటుంది. విద్యుత్తు వినియోగమూ ఎక్కువే. ప్రతినెలా రూ.లక్షల్లో వచ్చే బిల్లును ఆదా చేస్తూ, కరెంటు వాడకాన్ని తగ్గించేందుకు సర్కారు తీసుకొచ్చిన సౌర విద్యుత్తు విధానం సత్ఫలితాలనిస్తోంది. 660 కిలోవాట్ల సామర్థ్యమున్న సౌరపలకల నుంచి నెలకు 78వేల యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తద్వారా నెలవారీ బిల్లులో రూ.8 లక్షల దాకా ఆదా అవుతోందన్నారు. సౌర విద్యుత్తు భారీగా వినియోగిస్తున్న మ్యూజియం దేశంలో ఇదే కావడం గమనార్హం.    

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని