అవినీతిపై ఆప్‌ తరహాలో పోరాడండి

అవినీతిపై తెలంగాణలోనూ ఆప్‌ తరహాలో పోరాటం చేయాలని సుపరిపాలన వేదిక(ఎఫ్‌జీజీ) కార్యదర్శి పద్మనాభరెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. దిల్లీ, పంజాబ్‌లో పర్యటించిన కేసీఆర్‌ ఆయా రాష్ట్రాల్లో

Published : 26 May 2022 04:56 IST

కేసీఆర్‌కు ఎఫ్‌జీజీ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: అవినీతిపై తెలంగాణలోనూ ఆప్‌ తరహాలో పోరాటం చేయాలని సుపరిపాలన వేదిక(ఎఫ్‌జీజీ) కార్యదర్శి పద్మనాభరెడ్డి బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాసిన లేఖలో కోరారు. దిల్లీ, పంజాబ్‌లో పర్యటించిన కేసీఆర్‌ ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న కార్యక్రమాలు దేశానికి ఆదర్శమని కొనియాడారని ఆ లేఖలో పద్మనాభరెడ్డి గుర్తు చేశారు. ‘‘దిల్లీలో విద్యావ్యవస్థ గురించి తెలుసుకునేందుకు తెలంగాణ నుంచి కొందరు ఉపాధ్యాయులను దిల్లీకి పంపుతామని కేసీఆర్‌ చెప్పారు. ఇదే స్ఫూర్తిని అవినీతిపై పోరులోనూ కొనసాగించాలి. కాంట్రాక్టుల్లో కమీషన్లు అడిగారని పంజాబ్‌లో ఆప్‌ ప్రభుత్వం ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రిని పదవి నుంచి తొలగించింది. తెలంగాణలో ప్రభుత్వ పనుల్లో ఎక్కువ మొత్తంలో కమీషన్లు తీసుకొంటున్నారని విమర్శలు వస్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ కొనసాగుతున్న అవినీతిపై ఉక్కుపాదం మోపాలి’’ అని లేఖలో సీఎం కేసీఆర్‌ను కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని