Published : 26 May 2022 05:18 IST

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ‘హార్ట్‌ఫుల్‌నెస్‌’ సేవలు

ఈనాడు, హైదరాబాద్‌: విద్యార్థుల్లో మానసిక, భావోద్వేగ సమస్యలను నియంత్రించే దిశగా హైదరాబాద్‌ శివారులోని శ్రీరామచంద్ర మిషన్‌ ఆధ్వర్యంలో కొనసాగుతున్న హార్ట్‌ఫుల్‌నెస్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు కృషి చేయనుంది. కళాశాల స్థాయిలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు బుధవారం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ)తో దిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏఐసీటీఈ ఛైర్మన్‌ అనిల్‌ సహస్రబుద్ధే, హార్ట్‌ఫుల్‌నెస్‌ క్యాంపస్‌ ప్రోగ్రాం డైరెక్టర్‌ రమేశ్‌ కృష్ణన్‌, ట్రస్టు పీఆర్‌ డైరెక్టర్‌ నివేదిత శ్రేయాన్స్‌ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఏఐసీటీఈ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు, కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు హార్ట్‌ఫుల్‌నెస్‌ సంస్థ అందించే కోర్సులు చేసే వీలు కలుగుతుంది. పీజీ, యూజీ స్థాయిలో కోర్సులు చేస్తే విద్యార్థులకు ప్రత్యేకంగా క్రెడిట్స్‌ దక్కనున్నాయి. ఆయా ప్రోగ్రామ్స్‌లో విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు దక్కనున్నాయి. ధ్యాన శిక్షణ, అవగాహన తరగతులు, అధ్యాపకులకు శిక్షణ తరగతులు నిర్వహించేందుకు కళాశాల స్థాయిలో ట్రస్టు తరఫున హార్ట్‌ఫుల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. హార్ట్‌ఫుల్‌నెస్‌ గైడ్‌ కమలేశ్‌ పటేల్‌ (దాజి) మాట్లాడుతూ ఈ కోర్సులతో విద్యార్థులు తమలో నిబిడీకృతమైన ఎన్నో అంశాలను నేర్చుకునేందుకు అవకాశం లభిస్తుందన్నారు.

Read latest Ts top news News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని