సమాజాభివృద్ధిలో అందరూ భాగస్వాములవ్వాలి

సమాజాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బి.వెంకటేశం అన్నారు. మన ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మన్నేపల్లి అప్పారావు సేవా జీవితంపై ‘ఈనాడు’ అంతర్యామి రచయిత...

Published : 26 May 2022 05:32 IST

ఫిలింనగర్‌ న్యూస్‌టుడే: సమాజాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ బి.వెంకటేశం అన్నారు. మన ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మన్నేపల్లి అప్పారావు సేవా జీవితంపై ‘ఈనాడు’ అంతర్యామి రచయిత ఆనందసాయి స్వామి రచించిన అ‘సామాన్యుడు’ పుస్తకావిష్కరణ బుధవారం ఇక్కడ జరిగింది. వెంకటేశం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. సేవ చేసే వారు ప్రజాప్రతినిధులుగా రావడం ద్వారా సమాజానికి మరింత మేలు జరుగుతుందన్నారు. మనిషికి ఏ వాదం అక్కర్లేదని, మానవతా వాదమే ముఖ్యమన్నారు. తాను ఏ రోజూ ఎవరి సాయం ఆశించకుండా హోం ట్యూషన్‌ చెప్పి ఆల్‌ ఇండియా టాపర్‌గా నిలిచానన్నారు. మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన రోజుల్లో అసామాన్యులు అనే ఓ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సమాజానికి మంచి చేసే వారిని గుర్తించి సన్మానించేవారమన్నారు. పుస్తక రచయిత ఆనందసాయి స్వామి మాట్లాడుతూ.. సమాజ సేవ చేసే మన్నేపల్లి అప్పారావు లాంటి వారు వేలాదిగా రావాల్సిన అవసరం ఉందన్నారు. మన్నేపల్లి అప్పారావు మాట్లాడుతూ.. మెదక్‌ జిల్లా కలెక్టర్‌గా బి.వెంకటేశం ఉన్న సమయంలో తనకందించిన సహకారం మరువలేనిదన్నారు. సుప్రసిద్ధ కవి బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రైల్వే విశ్రాంత అధికారి ఎ.భరత్‌భూషణ్‌,  చిత్ర నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నేషనల్‌ ఛైల్డ్‌ లేబర్‌ ప్రాజెక్ట్‌ ఫార్మర్‌ డైరెక్టర్‌ పమిడిముక్కల సుధాకరరావు, గజల్‌ కవయిత్రి, భాషా పరిశోధకురాలు రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి, కవయిత్రి కళ తాటికొండ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని