‘అమరావతి’ అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం!

ఏపీ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం కోసం బ్యాంకులను సంప్రదించగా, ఈ మొత్తాన్ని రెండుగా విభజించి, డీపీఆర్‌లు ఇవ్వాలని వారు సూచించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు.

Published : 26 May 2022 05:32 IST

ఈనాడు, అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధికి రూ.3వేల కోట్ల రుణం కోసం బ్యాంకులను సంప్రదించగా, ఈ మొత్తాన్ని రెండుగా విభజించి, డీపీఆర్‌లు ఇవ్వాలని వారు సూచించినట్లు ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌ వివేక్‌ యాదవ్‌ తెలిపారు. ఈ మేరకు విజయవాడలోని సీఆర్డీఏ కేంద్ర కార్యాలయంలో బుధవారం కమిషనర్‌ విలేకరుల సమావేశం నిర్వహించారు. ‘ఒకే రాజధానిగా ఉంటేనే రుణం ఇస్తామని, ఈ విషయంలో హామీ ఇస్తారా అని బ్యాంకర్లు అడిగినట్లు తెలిసింది. అది నిజమేనా?’ అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... బ్యాంకులు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారమే రుణాలు ఇస్తాయన్నారు.  ‘‘ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిలభారత సర్వీసు అధికారుల నివాస సముదాయాల పనులను తిరిగి ప్రారంభించాం. ఇవి నవంబరు నాటికి పూర్తవుతాయనే అంచనా ఉంది. సీడ్‌ యాక్సెస్‌ రోడ్డులో నాలుగుచోట్ల ఉన్న గ్యాప్‌ల పనులను త్వరలో చేపడతాం’ అని కమిషనర్‌ వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని