చిన్ని ఉపాయం.. తొలగెను అపాయం!

మండుటెండల కారణంగా కోడిపిల్లల రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉక్కపోత కారణంగా కొన్ని పిల్లలు మధ్యలోనే మృతి చెందుతుండటంతో ఉత్పత్తి సంస్థలు నష్టాన్ని భరించాల్సి వస్తోంది.

Published : 26 May 2022 05:32 IST

మండుటెండల కారణంగా కోడిపిల్లల రవాణాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఉక్కపోత కారణంగా కొన్ని పిల్లలు మధ్యలోనే మృతి చెందుతుండటంతో ఉత్పత్తి సంస్థలు నష్టాన్ని భరించాల్సి వస్తోంది. ఇందుకు పరిష్కారంగా ఓ సంస్థ వారు చల్లదనం కోసం వాహనం చుట్టూ ఉండే ఇనుప షీట్లను తొలగించి.. జాలీల సాయంతో గడ్డిని అమర్చారు. దాన్ని నీటితో తడిపి ప్రయాణానికి సిద్ధం చేశారు. అలా కోడిపిల్లలను భద్రంగా సిద్దిపేట నుంచి నిజామాబాద్‌కు బుధవారం వాహనంలో తీసుకొస్తుండగా తీసిన చిత్రమిది. ఇలా చేయడం ద్వారా కోడిపిల్లల మరణాలు తగ్గాయని డ్రైవర్‌ తెలిపారు.

- న్యూస్‌టుడే, డిచ్‌పల్లి గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని